మొదటి రాంకు 1- Mudati Rank- Yandamoori V

గతంలో విద్యార్థుల కోసం యండమూరి వ్రాసిన “చదువు – ఏకాగ్రత – జ్ఞాపకశక్తి” కి సంబంధించిన పుస్తకాల సారాంశాన్నీ క్లుప్తీకరించి ఒక చిన్న పుస్తకంగా వేస్తే చదువుకోటానికీ, ఆచరించటానికీ బావుంటుందనీ, ముఖ్యంగా బీద విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ వంద సూత్రాల పుస్తకం వెలువరించటం జరుగుతోంది. మిత్రుడు వీరేంద్రనాథ్ కి అభినoదనలు.
– బి.వి. పట్టాభిరాం. ప్రశాంతి కౌన్సెలింగ్ సెంటర్.
ప్రతీ పేరెంటు, ప్రతి ఉపాధ్యాయుడూ ఈ సూత్రాల్ని పిల్లలతో చదివించాలి. ప్రాక్టీసు చేయించాలి. ఈ పుస్తకం వెనుక పేజీలో చెప్పినట్టుగా దీని ఫలితం అనుభవిస్తేనే గానీ తెలీదు. సామాన్య విద్యార్థిని కూడా అసామాన్యంగా తీర్చి దిద్దే శక్తి ఈ సూత్రాలకి ఉన్నదని నమ్ముతున్నాను. ఈ పుస్తకం చదివితే మీరు కూడా నా అభిప్రాయంతో ఏకీభవిస్తారు
– గంపా నాగేశ్వరరావు, ఇంపాక్ట్.
గురువుగారు యండమూరి పుస్తకాల్లో వ్రాసిన చాలా విషయాలు నా ‘మెమరీ మంత్ర’ క్లాసుల్లో ఇప్పటికీ చెపుతూనే ఉంటాను. ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి సంబంధించి దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల్లో వచ్చిన మార్పుకి నేనే ప్రత్యక్ష సాక్షిని.
– జె.యస్.పి. రాజ్ చీఫ్ ఆర్బిటర్ ఆఫ్ నేషనల్ మెమరీ కౌన్సిల్ అఫ్ ఇండియా.
పెద్దల సూచనలు విని తెలివైన పిల్లలు సమయం అదా చేసుకుంటారు. వారి అనుభవాలను వాడుకుని సునాయాసంగా విజయం మెట్లు ఎక్కుతారు. పరీక్షల వత్తిడిని ఎలా అధిగమించాలో, ఎలా చదవాలో ఎన్నో సూచనలు, యండమూరిగారి అనుభవాలు ఈ పుస్తకoలో ఉన్నాయి. ఉపయోగించుకుని మీ కలల్ని సాకారం చేసుకోండి.
– వై. మల్లికార్జునరావు. నేషనల్ హాండ్ రైటింగ్ అకాడమీ.
It’s a great guide and tool by Dr. Yandamoori veerendranath for the students who wish to break the box and think beyond, to unleash their inner potential and develop all over personality, essential to excel in their academics.
-Dr. Chiranjeevi, Medha Institute of English and Personality Development.
విజయo తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. లోపలికి వెళ్ళే ‘ప్రయత్నం’ చెయ్యకుండా, తాళం చెవి కోసం గుమ్మం బయట వెతుకుతూ ఉంటారు కొందరు. రహస్య సులభ సొరంగ మార్గాల అన్వేషణలోనే జీవితం గడిపేస్తారు మరి కొందరు. లోపలికి వెళ్ళే ‘ప్రయత్నం’ చెయ్యకుండా బయట ఎంత వెతికినా ఏం లాభం?
ఈ క్రింది సూత్రాల ఆచరణ మొదట్లో కష్టంగా తోస్తుంది. ఒకసారి అలవాటయ్యాక ‘చదువు ఇంత సులువా! విజయం ఇంత బావుంటుందా!’ అనిపిస్తుంది. గెలుపు భవంతి మొదటి మూడు మెట్లెక్కడమే కష్టం. పై మెట్టు చేరేసరికి మిగతావాళ్ళంతా క్రిందుంటారు. అప్పుడు అలసట ఉండదు. మీ మీద మీకు నమ్మకం, ఉత్సాహం కలుగుతాయి.
టీచర్స్, ప్రీచర్స్ అని మోటివేటర్స్ రెండు రకాలు. పుస్తకాల్లో చదివింది చెప్పేవాళ్ళు టీచర్స్..! తాము ఆచరిస్తున్నది చెప్పేవాళ్ళు ప్రీచర్స్..! ఈ పుస్తకంలో వ్రాసిన చాలా సూత్రాలు నా రచనా జీవితంలో ఇప్పటికీ అమలు జరుపుతాను.
ఇందులో వ్రాసినట్టుగా మీరు చదివేటప్పుడు టోపీ పెట్టుకోవటాలూ, ఏక నాసికా రంధ్రంతో గాలి పీల్చటాలూ చూసి ఇంట్లోవాళ్ళు మొదట్లో ముసి ముసిగా నవ్వొచ్చు గాక. కానీ, కొద్ది రోజుల్లోనే మీలో మార్పు చూసి చుట్టు పక్క పిల్లలందరికీ రికమెండ్ చేస్తారు. మీరంటే ఇంట్లోవారికి ప్రేమతో బాటూ గౌరవం కూడా పెరుగుతుంది. బెస్టాఫ్ లక్.
-0-
People search for the key to success, without realising that success has no doors. Only way to ‘step in’ is to work for it.
Motivators are of two types, Teachers and Preachers. Teachers tell you what they read in their books or heard somewhere. ‘Preachers’ teach you what they practiced and experienced. I still practice many of these tips while working on my scripts.
Some of these tips (like restricting the gossiping, 10-C and vice holiday techniques etc.) are tough to adopt in the early stages but, you soon feel the difference in your concentration levels, once you get acquainted.
Your family members may smile at you, watching you wearing a scarf while reading, or breathing heavily with a wet-cloth on your eyes, but don’t worry. Soon they realise your positive changes, the rising graph of your attentiveness and memory levels, and start recommending these tips to others too. Wish you all the best.
Book Details
- Stories 1
- Quizzes 0
- Duration 50 hours
- Language Telugu